ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన విషయం. తల్లి బిడ్డకు జన్మనివ్వడం. సాధారణ కాన్పుతో జన్మనివ్వడం ఇంకా అద్భుతం. అయితే పురిటి నొప్పులు తప్పించుకోవటానికి సిజేరియన్‌ సర్జరీని ఎంచుకునే వారు కొంద‌రు. ఇలా నేటి రోజుల్లో బిడ్డను కనడం అంటే సిజేరియన్ చేసి డెలివరీ చేయడమేగా సాధారణం అయిపోయింది. సిజేరియన్ తర్వాత తల్లి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి సిజేరియన్ చేయించుకున్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

అలాగే ముఖ్యంగా సిజేరియన్ ఆపరేషన్ జ‌రిగి ఉంటే కుట్లు నయమవడానికి ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఉప్పు గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అందువలన, స్నానం చేసే సమయములో వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని చేయండి. అలా అని నీటిలో ఎక్కువ ఉప్పు కలపకండి, ఎందుకంటే మీ చర్మంలో తేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కుట్లు మీద ఎటువంటి ఒత్తిడి పడినా మంచిది కాదు. కానీ మలబద్ధకం ఉంటె అక్కడ ఒత్తిడి పడనీయకుండా ఉండలేము. కాబట్టి మలబద్ధకం దారికి రానీయకుండా చేయండి.

 

అందుకోసం పీచు పదార్థాలు ఎక్కువుగా ఉన్న ఆహారం తీసుకోండి, వీలైనంత ఎక్కువ నీరు తాగండి. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. కామన్ కోల్డ్, దగ్గు కి దూరంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. సిజేరియన్ తర్వాత ఎక్కువగా దగ్గడం వల్ల సర్జరీ చేసిన దగ్గర ఒత్తిడి పెరిగి.. గాయం మానడానికి సమయం పడుతుంది. తాడిగా ఉంటె ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి కుట్లను అసలు తడిగా ఉండనీయకండి. అలాగే ఆహారంలో విటమిన్ సి అధికంగా వుండే ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: