ప్ర‌తి రోజూ ఉదయాన్నే పాలు తాగడం మంచి అలవాలు. అది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను మిల్క్ ద్వారా పొందవచ్చు. కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి వంటివి పాల ద్వారా శరీరానికి అందుతాయి. ప్యాకెట్ పాలు లేక పాడి రైతు నుంచి పాలు తెచ్చుకోవడం వీటిలో ఏది మంచిదన్న విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే... అసలు ప్యాకెట్ పాలను మరిగించొచ్చా? కాచి వాడుకోవాలా? లేక నేరుగా వాడుకోవాలా? అన్న‌ది ఇప్పుడు తెలుసుకోవాలి.

 

అయితే ఒక‌సారి మీరు వాడుతున్న ప్యాకెట్ పాలను ఓ సారి గమనించండి. ప్యాకెట్ పై పాశ్చురైజ్డ్ అని రాసి ఉందా? ఉంటే ఆ పాలను కాచాల్సిన పనిలేదు. సేకరించిన పాలను ముందుగా డెయిరీ ప్లాంట్లలో పాశ్చురైజేషన్ చేస్తారు.  పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, అనంతరం చల్లారిన తర్వాత ప్యాకెట్లలో ఫిల్ చేస్తారు. దీంతో పాలు తాజాగా ఉంటాయి. సో.. వీటిపి ప్ర‌త్యేకంగా కాచుకోవాల్సిన ప‌ని లేదు. కావాల‌నుకుంటే లైట్‌గా వేడి చేసుకొని వాడుకోవాలి.

 

ఇక ప్యాకెట్ పాలు కాకుండా మామూలు పాలు అంటే రైతుల ద‌గ్గ‌ర నుంచి సేక‌రించే పాల విష‌యానికి వ‌స్తే.. అందులో ఉండే వ్యాధి కారక బ్యాక్టీరియాను చంపేందుకు తప్పనిసరిగా వాటిని 80-90 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కాచి వాడుకోవడమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఒక‌సారి కాచిన పాల‌ను త‌ర్వాత మ‌ళ్లీ ప‌దే ప‌దే మ‌రిగించ‌కూడ‌దు. అలా చేయ‌డం  వల్ల పాలలోని పోషకాలు చచ్చిపోతాయి. పాలలో క్యాల్షియం, విటమిన్ ఏ, డీ, బీ1, బీ2, బీ12, కే ఉంటాయి. పాలను ఎక్కువ‌గా మరిగించడం వల్ల ఇవన్నీ కోల్పోతామ‌ని నిపుణులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: