వివాహం అన్నది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. దీని కోసం ప్రతి మనిషి తపించిపోతాడు. అన్నింటికి మించి అందమైన జీవితం కావాలని కోరుకుంటాడు. అలా అందమైన జీవితం కావాలని కోరుకునే మనిషి కి అటువంటి వ్యక్తి లభిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందిచెప్పండి. జీవితం అన్నాక చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడున్న టెన్సన్స్ లో ఇవి కామన్. కానీ, కొంతమంది వాటిని పట్టించుకోరు. అంతేకాదు, ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్దాంతం చేస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతుంటారు.
ఇలాంటి వ్యక్తులు జీవితంలో తొందరగా విడిపోతుంటారు. అలా కాకుండా పెళ్లి సమయంలో చేసుకున్న బాసలు కలకలం ఉండేలా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫోలో కావాలి. వాటిని ఫోలో అయితే తప్పనిసరిగా జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఎలాంటి కలతలు ఇబ్బందులు వచ్చిన సర్దుకుపోతారు. అది అందరికీ ఉండకపోవచ్చు. నిత్యం ఇలాంటి విషయాల్లో ఎమోషన్ అయ్యే వ్యక్తులకు చిన్న కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది.
ఆ కౌన్సిలింగ్ లో వచ్చే స్కోర్ ను బట్టి వారి లైఫ్ ను అంచనా వేయవచ్చు. వీటికోసమే పినాకిల్ కౌన్సిలింగ్ సంస్థ ఏర్పడింది. భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను తీసుకొని కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాటికి చెప్పే సమాధానం బట్టి ఎలాంటి టిప్స్ ఉపయోగపడతాయో వాటిని వాళ్లకు వివరిస్తారు. ఇప్పటికే అనేకమంది ఈ విషయంలో కౌన్సిలింగ్ తీసుకొని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు.
సుఖమయంగా, ఆనందదాయకమైన జీవితం కావాలి అంటే తప్పనిసరిగా కొన్ని సమయాల్లో తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన, లేదా ఎలాంటి ఇబ్బందులు పెట్టినా అది ఆ మనిషి తీసుకునే నిర్ణయాలను బట్టే ఉంటుంది. మ్యారిటల్ సాటిస్ఫ్యాక్టరీ అస్సేస్మెంట్ తీసుకోవడం వలన ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే కింద ఉన్న వీడియోను చూస్తే అర్ధం అవుతుంది.