ఆకుకూరల్లో ' పాలకూర ' ఎంతో ప్రయోజనకారి అన్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్పటికీ పాల‌కూర‌ను తిన‌డానికి కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది మీ జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది. పాల‌కూర నుంచి విటమిన్ ఎ , బి , సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, మెగ్నీషియం, ఇనుము, అమైనో ఆమ్లాలు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు విస్తారంగా లభ్యమవుతాయి. ఇక సాధార‌ణంగా పాల‌కూర‌ను ఏ ప‌ప్పులోనూ వేసుకుని తింటుంటారు. 

 

అలాకాకుండా పాల‌కూర‌ను జ్యూస్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. ఈ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల పాలకూర యాంటీ ఆక్సిడెంట్ మరియు ప్రోటీన్ తత్వాలను ఎక్కువగా కలిగి వుండటం వల్ల కండరాలను బలోపేతం చేస్తుంది. అలాగే పాలకూర జ్యూస్‌ను నిత్యం సేవిస్తుంటే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మ‌రియు పాలకూర జ్యూస్‌ను తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపుచేయడంతోపాటు అధిక బరువు కూడా తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

ఊబకాయంతో బాధపడేవారు క్రమం తప్పకుండా పాలకూర, క్యారట్లను కలిపి జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా,  పాలకూర పాటు క్యారెట్ల క‌లిపి జ్యూసు చేసుకుని క్రమం తప్పకుండా తాగడం వల్ల కంటిచూపును మెరుగు పరుచుకోవచ్చు. వీటిలో కళ్ళకు మేలు చేసే విటమిన్ ‘ ఎ ' సమృద్ధిగా వుంటుంది. కడుతుంది. మ‌రియు గర్భిణీలు నిత్యం పాలకూర జ్యూస్ తాగితే ఎంతో మంచిది. వారి కడుపులో ఉండే శిశువు పుట్టాక నాడీ మండల సమస్యలు రాకుండా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: