కిమ్స్-లివ్‌లైఫ్ సెంటర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ లో శనివారం ఘనంగా జరుపుకుంది. ప్రముఖ బారియాట్రిక్ సర్జెన్ డా. నందకిషోర్ దుక్కిపాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో లైవ్ మ్యూజిక్ షో, ఫ్యాషన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఫ్యాషన్ షోలో డిజైనర్ శిరీషా రెడ్డి రూపొందించిన బ్రైడల్ లెహంగాస్, ప్రింటెడ్ ఆర్గాంజా వెడ్డింగ్ కలెక్షన్స్ లో డాక్టర్స్, వెయిట్ లాస్ పేషెంట్స్ చేసిన ర్యాంప్ వాక్ సెలబ్రేషన్స్ లో హైలైట్ గా నిలిచింది. బాలీవుడ్ నటి అమైరా దస్తూర్, టాలీవుడ్ నటి ప్రియాంక, సోషలైట్ శ్రీదేవి చౌదరి, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని, కిమ్స్  హాస్పిటల్ ఎండి. డాక్టర్ బి. భాస్కర్ రావు, ఎంఎస్ వాసుప్రద, అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా  నెస్లే హెల్త్ సైన్స్ "ఆప్టిఫాస్ట్"  సైంటిఫికల్లి డిజైన్డ్ మీల్ ప్రొడక్ట్ అతిథులు ఆవిష్కరించారు. 

 

ఉబకాయం వల్ల కలిగే సమస్యలపై.. 

అంతకు ముందు ఒబెసిటి పై ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. ఇందులో కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, డయాబెటాలజిస్టులు, ఆర్థోపెడిషియన్లు, గైనకాలజిస్టులు, బారియాట్రిక్ సర్జన్లు వంటి వివిధ రంగాల నిపుణులు పాల్గొని ఉబకాయం వల్ల శరీరంలోని ప్రధాన వ్యవస్థలపై ప్రభావం పడుతుందని, వివిధ రకాల రోగాలకు దారితీస్తుందని చర్చించారు. అర్బన్ స్కూల్ పిల్లల్లో ఒబెసిటీ శారీరకంగా, మానసికంగా  ప్రభావితం చూపిస్తుందని, దీనిపై స్కూల్ ప్రిన్సిపల్స్, సైకాలజిస్ట్ లు పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఉబకాయం వల్ల చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారని తెలిపారు. స్కూల్స్ లో, ఇంట్లో పిల్లలతో ఫిజికల్ ఆక్టివిటీలు చేపించాలని, జంక్ ఫుడ్, అనారోగ్యానికి కారణమయ్యే ఫుడ్ హాబిట్స్ నుంచి దూరంగా ఉంచాలని డిస్కషన్ లో పాల్గొన్న వైద్యులు సూచించారు. 

 

ఈ సందర్భంగా బారియాట్రిక్ సర్జెన్ డా. నందకిషోర్ దుక్కిపాటి మాట్లాడుతూ, కిమ్స్ - లివ్ లైఫ్  అసోసియేషన్ గతేడాది ప్రారంభమైందని తెలిపారు.  ఏడాది నుంచి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ తో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒబిసిటీ మహమ్మారిపై  పోరాడేందుకు పనిచేస్తున్నామని తెలిపారు.  వేలాది మంది రోగులకు, వారి బరువు తగ్గించుకునేందుకు తను, లివ్ లైఫ్ టీం ఎంతో సహాయపడిందని అన్నారు. గత సంవత్సరంలో 230 బారియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా చేశామని, అందులో భాగంగా రోగులలో ఉన్న  8200 కిలోల అధిక బరువును తగ్గించామని తెలిపారు. ఈ కేసెస్ లో అత్యధిక బరువున్న పేషెంట్196కిలోలు అని పేర్కొన్నారు. ఉబకాయంతో బాధపడుతూ, సర్జరీ చేయించుకునే ఆర్థికస్థోమత లేని రోగులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్జరీలు చేశామని తెలిపారు. కిమ్స్ లివ్ లైఫ్ ఒబెసిటీ సొల్యుషన్స్ లేదా కిలోస్ లో ఇటీవలే  నాన్-సర్జికల్ గైడెడ్ వెయిట్ లాస్ ప్రోగ్రాం ని ప్రారంభించామని డా. నందకిషోర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: