స్వీట్ కార్న్(మొక్కజొన్న పొత్తు).. ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. సయం సందవేళ వేడివేడిగా స్వీట్ కార్న్ తింటే ఆ మజానే వేరు. రుచే కాదు.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు స్వీట్ కార్న్‌లో మెండుగా ఉన్నాయి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంలో మొక్కజొన్న ఒక్కటి. ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వాటిలో స్వీట్ కార్న్ ఒకటి . స్వీట్ కార్న్ ఎన్నో వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. స్వీట్ కార్న్ లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండి యాంటియాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధిస్తుంది.

 

డయాబెటీస్ రోగులు మొక్కజొన్న తిన్నట్లయితే శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది. గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. స్వీట్ కార్న్ లో పీచు పదార్థం పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. పీచు మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. ప్రెగ్నన్సీ మహిళలు తమ ఆహారంలో స్వీట్ కార్న్ తప్పక చేర్చుకోవాలి.

 

దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళల కాళ్ళు చేతులు వాపురాకుండా చేస్తాయి. అలాగే స్వీట్ కార్న్‌లో విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి ఉండటం వల్ల  రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మొక్కజొన్నలో మన శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మరియు సెలీనియం వంటి మన శరీరంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. ముఖ్యంగా ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మరియు కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: