జామ పండు తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జామ పండ్లతో మాత్రమే కాదు జామ ఆకులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జామ పండ్లు శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు కాంతివంతంగా ఉంచుతాయి. జామ పండ్లు ఎక్కువగా పీచు పదార్థాన్ని కలిగి ఉండటంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. 
 
జామ పండ్ల ద్వారా ఏ, బి, సి విటమిన్లు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. రోజూ జామ పండ్లను తింటే కంటికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. జామలో ఉండే సి విటమిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచటంతో పాటు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఋతుక్రమ సమస్యలు రాకుండా జామ పండ్లు నివారిస్తాయి. జామ పండ్లలో ఉండే లైకోపిన్ అతినీల లోహిత కిరణాల నుండి వచ్చే క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. 
 
జామలో ఉండే పొటాషియం బీపీ, గుండె జబ్బులు తగ్గించడంలో సహాయపడతాయి. జామ ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామ పండ్లు ప్రతిరోజు తింటే అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. జామచెట్టు బెరడుతో కాచిన డికాషన్ తాగితే పొట్టలోని సూక్ష్మ జీవులు, నులి పురుగులు నశిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: