ఒకప్పుడు పాలు అంటే ఆవు లేదా గేదె పాలు ఉండేవి. మరిప్పుడో.. బోలెడన్ని రకాలు. సోయా, బాదాం, బియ్యపుపాలు, కొబ్బరిపాలు.. ఇలా పాలు వేర్వేరు రూపాల్లో అందుతోంది. అయితే జంతువుల పాలను తాగలేని వారికి సోయా పాలు వరమనే చెప్పవచ్చు. జంతువుల పాలకు సమానంగా పోషకాలు సోయా పాలలో ఉంటాయి. సోయా పాలను సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారు. సోయాబీన్‌ పాలు ఆవుపాల కన్నా, గేదెపాల కన్నా శ్రేష్ఠమైనవే కాక చాలా చవక కూడా.  బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా సోయాపాలు తీసుకోవచ్చు. సోయాపాల వినియోగం వల్ల మరిన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి.

 

సోయాపాలలోని ఒమెగా 3, 6 ఫ్యాటీఆమ్లాలు, శక్తిమంతమైన ఫైటో, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక హానికారక ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే ముప్పును నియంత్రిస్తాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులబారి నుంచి రక్షణ లభిస్తుంది. సోయా మిల్క్‌ను పోషకాల గని అని చెప్పవచ్చు. ఈ పాలలో మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని సోయా మిల్క్ తగ్గిస్తుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నందున సోయా మిల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే మెనోపాజ్‌ వయసు మహిళల్లో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గి సులభంగా హృద్రోగాల బారిన పడుతుంటారు. 

 

వీరు ముందునుంచే సోయాపాలు తీసుకుంటే అందులోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరించి పై సమస్యలు రాకుండా చేస్తుంది. సోయా మిల్క్‌లో ఉండే ప్రోటీన్లు శిరోజాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. కురులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సోయా మిల్క్‌లో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఇది మూడ్‌ను మారుస్తుంది. డిప్రెషన్‌ను పోగొడుతుంది. సోయా పాలలో ఉండే మెగ్నిషియం ఫీల్ గుడ్ హార్మోన్ అయిన సెరటోనిన్‌ను వృద్ధి చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: