సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్ గా , అందంగా ఉండాలని కోరుకుంటారు. నాజూకైన ఫిగర్ తో అందమైన డ్రెస్సు వేసుకోవాలని సూచిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా కొద్దికొద్దిగా శరీరంలో ఫ్యాట్ పెర‌గ‌డం క్ర‌మంగా బ‌రువు పెర‌గ‌డం జ‌రుగుతుంది. డైట్ , వ్యాయమం, మరియు వర్కౌట్స్ అనేవి దినదిన చర్యకు చాలా ఉపయోగపడుతాయి. అయితే వీటితో పాటు కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా అద్భుతంగా ప‌ని చేస్తుంది. అందులో అల్లం ఒక‌టి. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వంటల్లో విరివిగా వాడతారు. 

 

దీనిలోని మానవశరీరానికి ఉపయోగపడే ఎన్నో గొప్పగుణాలున్నాయి. దీంతో అనేక ఔషధాల తయారీలోనూ దీనిని వాడతారు. అయితే మ‌రి అల్లంతో బ‌రువు త‌గ్గ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం టీలో ఓ నిమ్మ బ‌ద్ద‌ రసం పిండుకొని తాగాలి. ఇలా నాలుగైదు గంటలకు ఓసారి తాగాలి. రోజుకు ఇలా మూడుసార్లు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.  భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం తురుము కలుపుకుని తాగితే.. బరువు తగ్గుతారు. ఇదీ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు యాపిల్ సైడెర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. 

 

ఇందులో అల్లం రసం కలిపి తీసుకోవాలి. లేదంటే అల్లం టీలో యాపిల్ సైడెర్ వెనిగర్ కలుపుకొని తాగాలి. అయితే.. అల్లం టీ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. రోజులో రెండో సగం స్నాక్స్ తినాలి అనిపిస్తుంది. అప్పుడు చిన్న అల్లం ముక్కను నములుతూ ఉండాలి. లేదా నోట్లో కొన్ని నిమిషాలు పెట్టుకోవాలి. ఇది తినాలన్న ఆలోచనను తగ్గిస్తుంది. నిమ్మరసం జ్యూస్‌లో అల్లం రసం కలిపి తాగాలి. ఇవి రెండూ ఆకలిని చంపేస్తాయి. అందువల్ల మనం ఎక్కువ ఆహారం తినలేం. ఫలితంగా బరువు తగ్గుతాం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: