నిమ్మ‌కాయ.. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌తి ఒక్క‌రూ దీని రుచి చూసే ఉంటారు. అయితే నిమ్మకాయ వంట‌ల‌కే కాదు.. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఇందులో ఉన్నాయి. నిమ్మ‌కాయ‌ మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే. నిమ్మ‌కాయ‌ని ఏదో ఒక రూపంలో నిత్యం ఉప‌యోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు.

 

గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం. నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది. అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

గర్బిణులకు వచ్చే వేవిళ్ల సమస్య తగ్గాలంటే నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి ఇవ్వాలి. అధిక రక్తస్రావం, విరేచనాలను అరికట్టే శక్తి నిమ్మ సొంతం. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు. రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం త్రాగితే పచ్చకామెర్ల వ్యాధి కూడా తగ్గుతుంది. అలాగే శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: