ఈ మధ్య కాలంలో సీజన్లతో సంబంధం లేకుండా జలుబు సమస్య వెంటాడుతోంది. జలుబుకు ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గడం లేదని చాలామంది చెబుతూ ఉండటం మనం తరచుగా వింటూనే ఉంటాం. జలుబు వచ్చిందంటే జలుబుతో పాటు తుమ్ములు, దగ్గు, తలనొప్పిలాంటి సమస్యలు వస్తాయి. కొన్ని వంటింటి చిట్కాలను ఫాలో అవడం ద్వారా జలుబును తగ్గించుకోవచ్చు. 
 
జలుబు వచ్చిన సమయంలో వేడినీటిని తాగడం మంచిది. వేడినీటిని తాగితే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. జలుబు త్వరగా తగ్గాలంటే వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచిది. దాల్చిన చెక్క కలిపిన నీటిని తాగినా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వేడిపాలల్లో కొంచెం పసుపు కలుపుకుని తాగితే జలుబు సమస్య దూరమవుతుంది. పసుపులో సాధారణంగా ఉండే యాంటీ బయోటిక్ గుణాలు జలుబును దూరం చేస్తాయి. 
 
అల్లం టీ, మిరియాల పాలు కూడా జలుబును త్వరగా తగ్గిస్తాయి. అల్లం, వెల్లుల్లి కలిపి తయారు చేసిన సూప్ తాగినా జలుబు తగ్గుముఖం పడుతుంది. కర్పూరంతో ఆవిరి పట్టినా మంచి ఫలితాలు ఉంటాయి. రోజుకు మూడుసార్లు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కలిస్తే కూడా జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లి రెబ్బల వాసన పీల్చినా, వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగినా జలుబు త్వరగా తగ్గిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: