ఏవైనా అవాంఛిత పదార్థాలు శ్వాస మార్గం ద్వారా శరీరం లోపలికి ప్రవేశిస్తే దగ్గు వాటిని శరీరం నుండి బయటకు పంపిస్తుంది. దగ్గు అనేది ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు లక్షణం అని చెప్పవచ్చు. దగ్గు అనేది ఒక రకంగా మంచిదే. ఊపిరితిత్తులకు దగ్గు రక్షణనిస్తుంది. ఒకటీరెండు రోజులు దగ్గు సమస్య ఉంటే పరవాలేదు కానీ దీర్ఘకాలంగా దగ్గు వేధిస్తే మాత్రం దగ్గుకు చికిత్స తీసుకోవటం ఉత్తమం. 
 
దగ్గు తగ్గించుకోవడానికి క్యాబేజీ మంచి మందు. క్యాబేజీ ఆకుల రసాన్ని రోజూ తాగితే దగ్గు తగ్గుతుంది. మిరియాలు, ధనియాలు, అల్లాన్ని కషాయంగా చేసుకొని తాగినా కూడా దగ్గు తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె తాగినా కూడా దగ్గు తగ్గుతుంది. తేనెను సొంటి కషాయంలో అల్లం కషాయంలో కలుపుకుని తాగినా కూడా దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
ఉమ్మెత్త ఆకులను ఎండించి చుట్టవలె చుట్టి పొగ దాగితే కూడా దగ్గు తగ్గుతుంది. గోరు వెచ్చని నీళ్లలో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు కలిపి తాగినా జలుబు తగ్గుతుంది. గ్లిజరిన్, తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే కూడా దగ్గు తగ్గుతుంది. దగ్గు అదేపనిగా వదలకుండా ఉంటే మాత్రం పాలల్లో అర టీ స్పూన్ పసుపుతో పాటు వెల్లుల్లి కలపటం మంచిది. నల్ల మిరియాల కషాయం తాగితే కూడా దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: