పని ఒత్తిడి పెరిగినా, ఒక్కరోజు నిద్ర లేకపోయినా సాధారణంగా తలనొప్పి వేధిస్తుంది. కొందరికి వారి ఆహారపు అలవాట్ల కారణంగా తలనొప్పి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తలనొప్పితో బాధ పడక తప్పదు. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. తలనొప్పితో బాధ పడేవారు ఐస్ ప్యాక్ ను తలకు పట్టిస్తే ఉపశమనం లభిస్తుంది. 
 
గోరువెచ్చని ఆవు పాలు తలనొప్పి నివారిణిగా బాగా పని చేస్తాయి. ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగినా తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో పాటు యాపిల్ పండు తీసుకున్నా తలనొప్పి క్షణాల్లో మటుమాయం అవుతుంది. తలనొప్పితో బాధ పడేవారు వెన్న, మటన్ తీసుకోకపోవడం మంచిది. మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం, పోషకాలున్న ఆహారాలు తలనొప్పిని దూరం చేస్తాయి. 
 
వెల్లుల్లి, నీరు మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా తలనొప్పి తగ్గుతుంది. కొబ్బరినూనెను వేడి చేసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు మసాజ్ చేసినా తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చందనాన్ని పేస్ట్ లా చేసుకొని నుదుటికి రాస్తే తలనొప్పి తగ్గుతుంది. కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం వలన తలనొప్పి తగ్గుతుంది. ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగినా తలనొప్పి దూరమవుతుంది. పాదాలను చల్లని నీటిలో ఉంచి తల వెనుక భాగాన్ని మసాజ్ చేసినా తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: