లవంగము అనే ఒక చెట్టు మొగ్గ. ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగా అన్నిరకాల వంటకాల్లోనూ ఉపయోగించబడుతుంది. మటన్, చికెన్ లేదా బిర్యానీ చేసినప్పుడు వాటిలో లవంగాలు వేస్తే  రుచే ప్రత్యేకమైంది. ఘాటుగా వుంటూ తన ప్రత్యేక రుచి, వాస‌న‌తో అలరిస్తుంది. లవంగాల్ని కూరలతోపాటూ... కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. అలాగే ల‌వంగాల‌తో ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేసేయండి. సాధార‌ణంగా చాలా మంది గుండెల్లో మంటతో బాధపడుతున్నారు. 

 

అలాంట‌ప్పుడు అనవసరమైన ఔషధాలను ఉపయోగించకుండా లవంగాల టీ తయారు చేసి త్రాగాలి. దీనికి కొద్దిగా లవంగం నీరు వేసి బాగా ఉడకబెట్టండి. ఈ నీరు తాగడం వల్ల గుండెల్లో మంట నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. గ్లాసు పాలలో కొద్దిగా లవంగాలు పొడి, రాతి ఉప్పు వేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.  లవంగా నూనెను కొంతకాలం తీవ్రమైన కీళ్ల నొప్పులకు మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ సమస్య ఉన్నవారు రాత్రిపూట ముందు లవంగా నూనెతో మసాజ్ చేయడం వల్ల సమస్య యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. 

 

అదేవిధంగా, దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మీరు రోజూ లవంగాలు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: