భారతీయులకు తమలపాకులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆరోగ్యానికి తమలపాకు ఎంతో మంచిది. తమలపాకు తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. తమలపాకులో విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉంటాయి. బోద వ్యాధితో బాధ పడుతున్న వారికి తమలపాకులను ముద్దగా నూరుకొని తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ తమలపాకు రసాన్ని తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుంది. 
 
కొబ్బరినూనెతో తమలపాకు రసాన్ని మిక్స్ చేసి వెన్నుకు మర్దన చేయడం వలన వెన్నునొప్పి తగ్గుతుంది. ఆవనూనెను గోరువెచ్చగా చేసి తమలపాకును నానబెట్టి శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవారు ఛాతీపై రాసుకుంటే ఉపశమనం కలుగుతోంది. మలబద్దకం సమస్యతో బాధ పడేవారు రోజూ ఒక తమలపాకు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది. తమలపాకును భోజనం తరువాత తింటే నోరు శుభ్రమవుతుంది. 
 
తమలపాకు జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. తలనొప్పితో బాధ పడేవారు తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకును ముద్దగా నూరి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. వారానికి రెండుసార్లు చొప్పున పట్టిస్తే చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. వైద్యులు తమలపాకును అధిక మొత్తంలో తీసుకుంటే మంచిది కాదని ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు ఎదురవుతాయని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: