నిమ్మకాయ అంటే తెలియని వారుండరు. ఇవి ప్ర‌తిఇంట్లోనూ కామ‌న్‌గా ఉంటాయి. ఎందుకంటే.. ప్ర‌తి రోజూ ఏదో ఒక అవసరానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. కూరల్లో, డ్రింక్స్‌లో నిమ్మకాయల్ని తెగ వాడేస్తుంటారు. నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మ‌రియు మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది ఆయుర్వేదంలోనూ నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని తెలిపారు.

 

అయితే నిమ్మ ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ అతి వాడితే మాత్రం ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. నిమ్మ‌ర‌సం ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్ సి మ‌న‌కు అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తుంది. డ‌యేరియా, వాంతులు, వికారం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.  చాకొటెట్లు, స్వీట్లు, తింటే పళ్లు పాడవుతాయని అంటుంటా కదా. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కూడా చిగుళ్లు పాడైపోతాయి.  అలాగే త్వ‌ర‌గా దంతాలు పుచ్చిపోతాయి. ముఖ్యంగా దంతాల‌పై ఉండే ఎనామిల్ పోతుంది. 

 

అదేవిధంగా, నిమ్మరసంను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లా శాతం పెరిగి అంతర్గత లైనింగ్ ను దెబ్బతియ్యడం వల్ల పెప్టిక్ అల్సర్ పెరుగుతుంది. నిమ్మరసం యూరినేషన్ను పెంచుతుంది. దాంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అందువల్ల దానిపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా మూత్రాశయ వ్యాధులు వస్తాయి. ఇక చివ‌రిగా అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యానికైనా..అందానికైనా నిమ్మరసంను మితంగా వాడుకుంటేనే మంచిది. లేదంటే సీరియస్ సన్ బర్న్ కు దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: