ఇటీవ‌ల కాలంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా యువతీయువకుల బాధ వర్ణణాతీతం. బరువు తగ్గాలన్న కసితో కడుపు కాలుతున్నా నోరు కట్టేసుకుంటారు. కొంద‌రికి ఎక్సర్‌సైజులు, డైటింగులతో ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడుతున్నా లాభం ఉండదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. వాస్త‌వానికి పెర‌గ‌డ‌మైతే తేలికే కానీ త‌గ్గాల‌నుకుంటేనే మ‌హా క‌ష్టం. అయితే ఇలాంటి వారు ఓ సారి జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి చూడండి. ఖ‌చ్చితంగా ముప్పై రోజుల్లో బ‌రువు త‌గ్గుతారు.

 

జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు. అయితే జీల‌క‌ర్ర ఆరోగ్యానికే కాదు.. సులువుగా బ‌రువు త‌గ్గ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి జీల‌క‌ర్ర‌ను ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె మ‌రియు ఒక టీ స్పూన్‌ జీల‌క‌ర్ర పొడి వేసి బాగా క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. 

 

సాధారణంగా వ్యాయామం చేస్తే తగ్గే కొవ్వు కంటే జీలకర్ర పొడిని రోజూ నీళ్లలో క‌లిపి తాగ‌డం వల్ల కరిగే కొవ్వు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. అదే విధంగా,  ఒక గ్లాస్ నీటిని పాత్ర‌లో తీసుకుని అందులో టీస్పూన్ జీల‌క‌ర్రను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. అలా వ‌చ్చిన నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. సులువుగా బ‌రువు త‌గ్గేలా కూడా చేస్తుంది. మ‌రియు జీల‌క‌ర్ర‌ను పొడి చేసి.. దాన్ని నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో ఒక క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా సులువుగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: