మధుమేహ వ్యాధి గ్రస్తులైన పిల్లల రక్తంలో చక్కెర మోతాదు చాలా అధికంగా ఉంటుంది. దీనికి కారణం క్లోమము చాలా తక్కువ కానీ లేక అసలు పూర్తిగా కానీ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడమే. క్లోమము విడుదల చేసిన హార్మోను మోతాదు రక్తంలోని చక్కెరలను నియంత్రించ లేక పోవడం లేదా శరీరం సహకరించకపోవడం. దీనినే రెండవ రకం మధుమేహం అంటారు. ఒకటవ రకం మధుమేహం చిన్న తనంలో కానీ లేక పసి ప్రాయంలో కూడా మొదలవ వచ్చు సాధారణంగా 6 నుంచి 13 సం.,, వయసులో మొదలవుతుంది.

 

రెండవ రకం మధుమేహం ముఖ్యంగా యౌవ్వన ప్రాయంలో మొదలవుతుంది. ఇది అధిక శాతం స్థూలకాయం అధిక బరువువున్న పిల్లలలో ఎక్కువ కనబడడం. సాధారణమవుతున్నాయి. ఏ పిల్లలలో రెండవ రకం మధుమేహం వచ్చే అపాయం ఎక్కువగా వుంటుంది ? దిగువ చూపిన లక్షణాలు కలిగిన పిల్లలకు 10 సం. నుంచి ప్రతి 2 సం. లకు ఉపవాసంలో చేయవలసిన చక్కెర పరీక్ష లు చేయిస్తూ ఉండాలి.

 


ఆ వయస్సు లో ఆ ఎత్తులో ఉండవలసిన బరువు కన్నా 120 % ఎక్కువగా ఉండడం. దగ్గరి రక్త సంబందికులలో రెండవ రకం మధుమేహం వుండడం. యౌవ్వన ప్రాయంలో రక్తంలోని చక్కెరలను నియంత్రించడంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు తలెత్తవచ్చు. దానికి కారణాలు మ‌ధ్య వ‌య‌సులో హార్మోన్లలో కలుగు మార్పులు. అధిక ఒత్తిడులు, అధిక శ్రమ, శరీరక సౌందర్యం పై ధ్యాస, చురుకుదనంతో కూడిన అధికమయిన పనులు, స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం మధుపానం, ధూమపానంతో ప్రయోగాలు ఇవ‌న్నీ మంచివి కావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: