ఆరోగ్యంగా.. ఆనందంగా.. ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. అందుకు ఎన్నో జాగ్ర‌త్తులు తీసుకుంటారు. అస‌లు ఆరోగ్యానికి ఉండ‌డానికి ఆహార జాగ్ర‌త్త‌లే చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో మొక్క‌జొన్న, మొక్క‌జొన్న పిండి కూడా ఉన్నాయి. కొద్దిగా చినుకు పడితే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అదే మొక్నజొన్న పొత్తు కనిపిస్తే వదులుతామా.. పూర్వం దీనిని కాల్చుకుని కాని, ఉడకపెట్టుకుని కాని తినేవారు. మొక్కజొన్నలో ఉన్న లాభా లు అన్నిఇన్ని కావు. చాలా దీర్ఘ కాలిక వ్యాధులకు అమృత ఔషదంలా పనిచేస్తుంది. 

 

మొక్క‌జొన్న పిండిలో ఉన్నటువంటి లూతెయిన్, జీక్జాన్ డిన్, అనే ఎమినోన్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోప్లోవిన్, ఆరోగ్యానికి ఎంతోసహకరిస్తాయి. వంట‌ల్లో మొక్క‌జొన్న పిండిని వాడ‌డం వ‌ల్ల  మదుమేహం, రక్తలేమి, జీర్ణక్రియను మెరుగుపరచడం, మలపద్దకం నివారణలో ఉత్త‌మంగా ప‌నిచేస్తుంది. అంతేకాదు, మొక్క‌జొన్నపిండి అనేక ర‌కాలుగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. గర్బణులకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. మొక్కజొన్న పిండిలో  ఉన్న ఫోలిక్ యాసిడ్ ఇటు తల్లికి, అటు కడుపులోని బిడ్డకు కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

 

గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే కడుపులోని పిండం ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు మొక్నజొన్న పిండితో చేసిన వంట‌లు లేదా మొక్క‌జొన్న‌ తింటే ఎంతో మంచిది. అంతేకాదు, కప్పు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మెుక్కజొన్నపిండిని తీసుకోని రెండింటీనీ బాగా కలపాలి. దీన్నీ గదుల మూలల్లో చల్లితే బొద్దింకలూ, క్రిములు సమస్య ఉండదు. మ‌రియు వాడిన బూట్లను భద్రపరిచేటప్పుడు అందులో కాస్త మొక్కజొన్న పిండిని వేస్తే ఆ తేమ వల్ల బూట్లు పాడవ్వకుండా ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: