సాధార‌ణంగా వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అందులో క‌రివేపాకు కూడా ఒక‌టి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. కూరలో కరివేపాకులా తీసిపారేశారు అంటూ వాపోయేవారు, కరివేపాకే కదా అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అయితే వంట‌ల‌కే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌రివేపాకుతో పొందొచ్చు.

 

కరివేపాకు, ధనియాలు వేయించి పొడి చేసుకుని ఉంచుకోవాలి. ప్రతీరోజూ వేడివేడి అన్నంలో ఈ పొడిని కలుపుకొని మొదటి ముద్దలో తినాలి. ఇలా తిన‌డం వ‌ల్ల అధిక కొలెస్ట్రాల్‌ను త‌గ్గ‌డ‌మే కాకుండా ఈజీగా బ‌రువు త‌గ్గిస్తుంది. రెగ్యులర్ గా కరివేపాకును తీసుకోవ‌డం వల్ల కొలెస్ట్రాల్ వెగంగా తగ్గుతుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కూడా వెల్లడి చేశారు. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెందిన ఆక్సిడేషన్ నివారించడానికి సహాయపడుతుంది.

 

కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు, బరువు తగ్గించే క్రమంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో హార్ట్ స్ట్రోక్ ను నివారించుకోవచ్చు. అంతేనా అంటే.. కాదండోయ్‌..! భోజనంలో కలిపిన కరివేపాకు ఆకులను తినటానికి ఇష్టపడకపోతే, రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వల్ల మూత్రపిండ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందొచ్చు. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కళ్ళ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: