ఈ కాలంలో అతి కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది బరువు తగ్గటమే.. పెరగటం ఏముంది కాస్త ఎక్కువ తింటే చాలు సరిపోతుంది. బాగా తిని కంటినిండా నిద్రపోయారు అంటే నెల అంటే నెల తిరిగేసరికి లావు అయిపోతారు. కానీ ఆ లావు తగ్గాలి అంటే మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడాలి. 

 

అయితే అలాంటి శ్రమ లేకుండా.. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ బరువు ఈజీగా తగ్గచ్చు అని అంటున్నారు కొందరు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. బరువు తగ్గాలి అనుకునే వారికీ చూయింగ్ గ‌మ్ ఎంతో సహాయం చేస్తుందట.. ఆక‌లిగా ఉన్న వారు చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి చ‌చ్చిపోతుంద‌ట‌. 

 

ఈ విషయం ఈ మధ్యే ఓ అధ్యయనంలో తేలింది.. చూయింగ్‌ గమ్‌ ను తినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది అని.. టెన్ష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడిగా ఉన్న‌ సమయంలో చూయింగ్‌ గమ్‌ తిన్న తగ్గుతుంది అని అంటున్నారు పరిశోధకులు. చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు పెరుగుతుంద‌నీ, ఏకాగ్ర‌తగా ప‌నిచేస్తార‌ని 2004లో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. 

 

ఆక‌లిగా ఉన్న సమయంలో చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి తగ్గి ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు అని అంటున్నారు పరిశోధకులు. అలా చెయ్యడం వల్ల శరీరానికి క్యాలరీలు తగ్గుతాయి అని.. అధిక బ‌రువు ఉన్న ఈ చూయింగ్ గమ్ తినటం వల్ల అతి తక్కువ కాలంలోనే బరువు తగ్గుతారు అని ఓ పరిశోధనలో తేలింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: