దేశంలో చాలామంది శరీరానికి కలిగే లాభనష్టాలను పట్టించుకోకుండా మినరల్ వాటర్ తాగుతున్నారు. ప్రస్తుతం పల్లెల్ని సైతం మినరల్ వాటర్ తాకింది. తాగడానికి పరిశుభ్రమైన నీరు ఎక్కడా లభించకపోవడంతో మధ్య తరగతి, సంపన్న వర్గాల ప్రజలు మినరల్ వాటర్ తాగితే అంతా ఆరోగ్యమే అనే భ్రమల్లో జీవిస్తున్నారు. వైద్యులు మాత్రం మినరల్ వాటర్ తాగితే లేని రోగాలను కొని తెచ్చుకున్నట్లే అనిచెబుతున్నారు. 
 
మినరల్ వాటర్ లో శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, సల్ఫర్, పాస్పరస్, సోడియం, క్యాల్షియం లాంటి మినరల్స్ దొరకవు. మినరల్ వాటర్ ఎముకల చుట్టూ ఉండే క్యాల్షియాన్ని తగ్గించి ఎముకల అరుగుదలకు కారణమవుతుంది. దీంతో కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వాటర్ ప్లాంట్లలో నీటిలోని క్లోరిన్ శాతాన్ని తగ్గిస్తారు. అలాంటి నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. 
 
ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండాలని కొన్ని కంపెనీలు కెమికల్స్ కలుపుతున్నాయి. ఆ నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ నెమ్మదించటంతో పాటు చర్మ సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిలో పీహెచ్ 7 శాతం ఉండాలి. నిపుణులు సగటున 3 శాతం పీహెచ్ ఉంటుందని అందుకని మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. నిపుణులు కుండ నీరు తాగితే ఎముకలకు కావాల్సిన క్యాల్షియం అందుతుందని చెబుతున్నారు. మినరల్ వాటర్ బదులు మున్సిపల్ వాటర్, బోరు నీటిని వేడి చేసి తాగితే మంచిదని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: