పూర్వకాలం నీళ్ళు కుండలో నిలువ ఉంచుకుని తాగేవారు. అలా రాను రాను, స్టీల్ బిందెలు, ఫిల్టర్ లు, ఫ్రిడ్జ్ లలో నిలువ ఉంచుకుని తాగుతున్నారు. అంతేకాదు.. మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. కానీ, ఆ మ‌ట్టి పాత్ర‌లే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతాయి. ముఖ్యంగా మ‌ట్టి కుండ‌లో నీరే మ‌న‌కు ఆరోగ్య‌క‌రం. మ‌రి మ‌ట్టికుండ‌ల్లోని నీటిని తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి అన్న‌ది చాలా మంది అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి ఈ వ్యాసం ఖ‌చ్చితంగా చ‌ద‌వాలి.

 

కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానం అని నిపుణులు స్వయంగా పరిశోధన చేసి నిరూపించారు. కుండలో ఉన్న లక్షణాల కారణంగా నీటిలో ఉన్న మళినాలు కుండ పీల్చుకుంటుంది. నీటిని పూర్తి స్వచ్చంగా చేస్తుంది. అలాగే మ‌ట్టి ఆల్క‌లైన్ స్వభావాన్ని క‌లిగి ఉంటాయి. మట్టితో చేసిన కుండ‌లో నీటిని పోస్తే ఆ నీరు కూడా ఆల్కలైన్ స్వభావాన్ని పొందుతాయి. ఆ నీటిని తాగడం వల్ల శ‌రీరానికి మేలు చేయ‌డ‌మేగాక‌..  గ్యాస్ట్రిక్‌, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.

 

ఇక మట్టికుండలోని నీటిని తాగడం వల్ల అధిక బ‌రువుతో బాధ‌పడేవారు బ‌రువు తగ్గుతారు. మన శరీరానికి కావలసిన మెటబాలిజం అందుతుంది. జలుబు, దగ్గు, ఆస్త్మాతో బాధపడే వారు ఫ్రిడ్జ్ లోని వాటర్ కంటే కుండ వాటర్ ను ఎంపిక చేసుకోవడచం మంచిది. అదేవిధంగా, మట్టి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహాజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. కుండలో నీరు నిల్వ చేసినప్పుడు నయం చేసే ఇమ్యూనిటి గుణాలను అధికంగా పెంచుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: