ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు మూడే మూడు. గుండె పోటు , డయాబెటిస్, క్యాన్సర్. ఈ మూడు ప్రజలని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ జబ్బులు మనమే కొని తెచ్చుకుంటున్నా సరే ఎక్కడా కూడా వీటి నియంత్రణపై శ్రద్ద పెడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నోటి రుచి కోసం  మనిషి పడే తాపత్రయానికి ఎంతో మంది ఈ జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మూడు రకాలా జబ్బులలో అత్యధికంగా వ్యాపిస్తున్న జబ్బు డయాబెటిస్. ఈ జబ్బు బారిన పడి ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా..

IHG

రోజు వారి ఆహార పద్దతుల మార్పు, జంక్ ఫుడ్స్ , నిద్ర లేమి, ఒత్తిళ్ళు, ఇలా ఎన్నో రకాల మనిషి తప్పిదాలు ఈ తీవ్రమైన జబ్బుకి కారణం అవుతున్నాయి. ఇదిలాఉంటే WHO నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో మనుషులని పొట్టన బెట్టుకునే అత్యంత ప్రమాదమైన జబ్బుగా డయాబెటిస్ వ్యాప్తి చెందనుందట. మరి ఇలాంటి జబ్బు రాకుండా ఉండాలంటే..శరీరంలో డయాబెటిస్ ప్రవేశించ కుండా ఉండాలంటే వేప చక్కని పరిష్కారమని అంటున్నారు నిపుణులు..

IHG

వేప చెట్టు ఇది పార్టీ ఒక్కరికి కల్ప వృక్షమనే చెప్పాలి. ఇదే ఇప్పుడు ఎంతో మందికి అమృతం కూడా. పూర్వం వేప చెట్టు ఇళ్ళలో ఉంటే ఎటువంటి జబ్బులు కూడా వచ్చేవి కావు. వేప నుంచీ వచ్చే గాలిని పీల్చడం కూడా శరీరానికి ఎంతో మంచిది. వేప చెట్టు నుంచీ వచ్చే ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు, ఇలా ప్రతీ ఒక్కటీ మందుల తయారీలు ఉపయోగిస్తారు.చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, నోటి సమస్యలు, ఇలా ప్రతీ ఒక్క సమస్యకి వేప ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. డయాబెటిస్ ని పూర్తిగా కంట్రోల్ చేయలేక పోయినా వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడగలదని పరిశోధకులు చెప్తున్నారు. వేపాకుల్లో యాంటీ వైరల్, ఫ్లేవనాయిడ్స్ వంటి గుణాలు ఉన్నాయి అవి బ్లడ్ లో గ్లూకోజ్ లెవిల్స్ పెరగకుండా చేస్తాయి.రోజు  వేప చిగుళ్ళు తింటూ ఉంటే ఎలాంటి జబ్బులు శరీరంలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా సరే వేప నియంత్రిస్తుందని ఆయుర్వేద నుపుణులు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: