సాధార‌ణంగా చాలామంది పొట్టలో ఏదో ఒక రకమైన క్రిములతో బాధపడుతున్నారు. ఏక కణ జీవులు మొదలుకుని నులి పురుగులు వరకు అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా నులిపురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. మ‌రియు సరిగ్గా ఉడికించని మాంసం తినడం , ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మ జీవులు కడుపులోకి చేరతాయి. నులిపురుగుల సమస్య పిల్లల్లోనే కాకుండా పెద్ద‌ల్లోనూ కనిపిస్తుంది. అయితే వీటికి చెక్ పెట్ట‌డానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది.

 

క్యారెట్‌ తురుమును వరుసగా వారం రోజులపాటు నాలుగు చెంచాలు తీసుకోవాలి. దీంతో కడుపులో పురుగులు మలం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఆహారం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చేతి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం, గోళ్లు కొరకకుండా ఉండటం, ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవడం, శుభ్రత లేనిచోట ఆహారం తినకూడదు అనే అంశాల పట్ల చిన్నారులకు అవగాహన కలిగించాలి. ఈ పురుగులన్నింటినీ నివారించే మందు ఆల్బెండజోల్‌. 

 

ఈ మాత్రలు వేసుకుంటే చాలు ఎలాంటి పురుగులైన చచ్చి మలవిసర్జనలో బయటకి వెళ్లిపోతాయి. అయితే పిల్లలకు ఈ మాత్రలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువ డోస్ వాటిని పిల్లలకు వేయకూడదు. కళ్లు తిరిగిపడిపోతారు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మాంసాహారం విషయంలో శుభ్రత చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతనే వాడాలి. మ‌రియు ప్రతిరోజూ కాచి, చల్లార్చిన నీటిని తాగాలి.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: