జలుబు లేదా పడిసం లేదా రొంప.. పేర్లు అనేకం గాని స‌మ‌స్య ఒక్క‌టే. వాస్త‌వానికి జలుబును ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మనలో ఎవరికీ ఉండదు. 200 వైరస్లు ఒకేసారి అటాక్ చేస్తే వచ్చేదే జలుబు. దీంతో ముక్కు దిబ్బడ, గొంతులో గరగరా, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే జలుబుకు ఎలాంటి వ్యాక్సీన్ లేదు. అయితే కొన్నిసార్లు ఎన్ని మందులు తీసుకున్నా ఈ సమస్య తగ్గదు. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే జలుబు నుంచి త్వ‌ర‌గా ఉపశమనం పొందొచ్చు.

 

కొబ్బరినూనెని వేడి చేసి అందులో కర్పూరం కరిగించి ఆ నూనెని ఛాతికి, వెన్నుకి, అరిచేతులకి మరియు అరికాళ్లకి రుద్దినట్టయితీ త్వ‌ర‌గా రిలీఫ్‌ను పొందొచ్చు. అలాగే  ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెలను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని అలాగే చప్పరించాలి. ఇలా రోజుకు మూడు, నాలుగు సార్లు తీసుకుంటే జలుబు నుంచి ఉప‌స‌మనం పొందొచ్చు. ఇక సాధారణంగా మనకొచ్చే జలుబు విషయంలో పుట్టగొడుగులు బాగా పని చేస్తాయి. 

 

అందువల్ల జలుబు వచ్చినప్పుడు వీటిలని ఎక్కువగా తీసుకుంటే మంచిదిది. అదేవిధంగా, వెల్లుల్లిని బాగా నూరి.. గంటక ఒకసారి దాని వాసన పీలిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అప్పుడప్పుడు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగడం వల్ల కూడా జలుబు తగ్గిపోతుంది.  మ‌రియు ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో బాగా పోరాడగలదు. జలుబును తగ్గించేందుకు ఆరెంజ్ బాగా ఉపయోగపడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెంచేందుకు కూడా ఆరెంజ్ బాగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: