ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం, సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. కొంతమంది బరువు పెరిగిన తరువాత తగ్గాలనే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కొన్ని చిట్కాలను పాటిస్తే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి ముందు కూరగాయలను ఉడికించి తయారు చేసిన సూప్ తాగితే పొట్ట నిండినట్లుగా ఉండటంతో అవసరానికి మించి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. 
 


రోజూ సరైన సమయానికి బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే కూడా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సరైన సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచిది. బరువు తగ్గడానికి కొందరు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం కంటే కొద్ది కొద్దిగా ఆహారం రెండు మూడు గంటలకు ఒకసారి తీసుకుంటే ఆకలి పెంచే హార్మోన్ విడుదల కాదు. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. 
 


బరువు తగ్గాలనుకునేవారు కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే మంచిది. కారం శరీరంలో మెటబాలిజం రేటును పెంచి కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. రాత్రి సమయంలో ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలింది. చక్కెరతో తయారైన ఆహార పదార్థాలకు, స్వీట్లకు దూరంగా ఉంటే సులభంగా బరువు తగ్గవచ్చు. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరంలో ఆకలి కలిగించే హార్మోన్లు తక్కువగా విడుదలవుతాయి. కాబట్టి ఆకలి తగ్గి, బరువు కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: