తాటి బెల్లం.. దీని వినియోగం భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. పూర్వకాలం చ‌క్కెర‌కు బ‌దులుగా తాటిబెల్లంను విరివిరిగా ఉపయోగించేవారు. అయితే ప్రస్తుత కాలంలో తాటి బెల్లం అంటే ఏంటో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాటి బెల్లం విశిష్టత గురించి వంద సంవత్సరాల క్రితం 'వస్తుగుణ దీపిక'లో రాసి ఉందట. ఇక తాటి బెల్లం ధర సాధారణ బెల్లానికి రెట్టింపు ఉంటుంది. కారణం దాని ఔషధ గుణాలపై ప్రజలకు ఉన్న నమ్మకమే. అందుకే ఎక్కడైనా తాటి బెల్లం అమ్మకానికి వస్తే ధర ఎక్కువైనా కొనేందుకు జనం ముందుకు వ‌స్తుంటారు.

 

మ‌రి తాటి బెల్లం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. తాటిబెల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. తాటి బెల్లాన్ని క్రమం తప్పకుండా 20 గ్రా. తీసుకోవటం వల్ల అనేక రకాలయిన వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలలో, చిన్న పిల్లల్లో రక్తహీనతను త గ్గిస్తుంది. అంతే కాకుండా తాటి బెల్లాన్ని వాడటం వల్ల వీర్య పుష్టి, దేహ పుష్టి కలుగుతుంది. అలాగే తాటి బెల్లంను నువ్వుల లడ్డుగా చేసుకుని వారానికి ఒకసారి తింటే ఇక ఏ రోగాలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

 

మ‌రియు శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలు కూడా తాటి బెల్ల‌డం కరిగిస్తుంది. మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తాటి బెల్లం తోడ్పడుతుంది. అదేవిధంగా, శ్వాసకోస నాళం, చిన్నపేగులలో చేరుకున్న విష పదార్ధాలను కూడా తొలగిస్తుంది. జలుబు, శ్వాసకోశ సమస్యలను తొలగించడంలో తాటి బెల్లం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: