శ‌రీరంలో లివ‌ర్ అత్యంత పెద్ద‌దైన అవ‌య‌వం అని మ‌నంద‌రికీ తెలుసు. ఇక మన బాడీలో మంచి, చెడు రెండూ జరుగుతుంటాయి. వాటి ప్రభావం ఎక్కువగా లివర్ పైనే పడుతుంది. ఎందుకంటే అది దాదాపు ఏడా వంద‌ల‌ రకాల పనులు జరిగేందుకు కారణమవుతోంది. ర‌క్తంలో ఉన్న విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన‌ప్పుడు శ‌క్తిని అందించ‌డం వంటి ఎన్నో ప‌నుల‌ను లివర్ నిత్యం చేస్తూనే ఉంటుంది. కాబ‌ట్టి లివ‌ర్ ఖ‌చ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. అయితే మద్యం సేవించడం మరియు ధుమపానం కాలేయాన్ని దెబ్బ తీస్తుందని అనే విషయం తెల్సిందే.

 

అయితే ఈ రెండే కాకుండా లివ‌ర్‌ను దెబ్బ తీసే ప‌దార్థాలు చాలానే ఉన్నాయి. విట‌మిన్ ఎ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ విట‌మిన్ శ‌రీరంలో మోతాదుకు మించినా దాని ప్ర‌భావం లివ‌ర్‌పై ప‌డుతుంద‌ట‌. దీంతో లివ‌ర్ ఆరోగ్యం నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. కూల్‌ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత మంది చెప్పినా ఇప్పటీకీ చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు. కానీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం త్వరగా చెడి పోతుంది.

 

చిప్స్ లాంటివి ఎక్కువ‌గా తిన్నా కూడా కాలేయానికి చాలా డేంజర్‌. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం యాబై శాతం వ‌ర‌కు ఉంటుంది. ఉప్పు ఎక్కువ‌గా తింటే దాంతో బీపీ పెరిగి అది ఫ్యాటీ లివ‌ర్ వ్యాధికి దారి తీస్తుంది. క‌నుక ఉప్పును చాలా త‌క్కువ‌గా తిన‌డం మంచిది. చక్కెర లేదా తీపి పదార్ధాలు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తినడం వల్ల శరీరం వినియోగించుకోగా మిగిలింది కాలేయంలో కొవ్వుగా నిల్వ ఉండి పోతుంది. ఇది లివ‌ర్‌పై ప్ర‌భావం చూపుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: