మన శరీరానికి నీరు ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. వైద్య నిపుణులు రోజూ ఉదయం లేవగానే తగిన మోతాదులో నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఉదయాన్నే నీరు తాగితే ఎటువంటి వ్యాధులు రావని సూచిస్తున్నారు. ఖాళీ కడుపున నీళ్లు తాగితే పెద్ద ప్రేగు శుభ్రం కావడంతో పాటు శరీరం పోషకాలను గ్రహించి కొత్త రక్తం తయారవుతుంది. 
 
 
వైద్యులు ఉదయం లేవగానే కనీసం అర లీటరు నీటిని తాగాలని సూచిస్తున్నారు. పరగడుపున నీళ్లు తాగితే మెటబాలిజం మెరుగవడంతో పాటు రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. శరీరం ద్రవ పదార్థాలను కోల్పోకుండా, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా చేస్తుంది. మెటబాలిజం మెరుగైతే శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఉదయాన్నే నీళ్లు తాగితే కండరాల కణాలు కూడా వృద్ధి చెందుతాయి. అర లీటరు నుండి ఒకటిన్నర లీటరు మంచినాటిని తాగితే కొన్ని వ్యాధుల భారీన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. 
 
వైద్యులు పగటిపూట నీటిని తాగకపోయినా పరగడుపున ఖచ్చితంగా తాగాలని సూచిస్తున్నారు. వీలైతే పరగడపున గోరువెచ్చని నీటిని తాగడం మరీ మంచిది. బీపీ, షుగర్, ఉదర సంబంధిత వ్యాధులు, రుతుక్రమ సమస్యలు, తలనొప్పి, ఆస్తమా, కొలెస్ట్రాల్ వ్యాధులు గోరువెచ్చని నీటిని తాగితే దూరమవుతాయి. గోరు వెచ్చని నీరు తాగిన 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగలేకపోతే గ్యాప్ ఇచ్చి తాగాలని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: