సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న రోగులను వేధిస్తూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడే కాదు జ్వరం తగ్గినప్పుడు కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. జ్వరం లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్లు రక్తంపై ఎటాక్ చేస్తాయి. జ్వరం వస్తే పోషకాలు అధికంగా ఉన్న ద్రవాహారం తీసుకోవాలి. సూప్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. 
 


జామ, బొప్పాయి, నారింజ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు తీసుకుంటే వాటిలో ఉండే విటమిన్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఇన్‌ఫెక్షన్ల ను తట్టుకునేలా చూస్తాయి. పాలు, పెసర, మొలకెత్తిన గింజలు, కందిపప్పు లాంటి ఆహారాలు జ్వరం వచ్చిన సమయంలో తీసుకుంటే శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి. మరీ నీరసంగా ఉంటే తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. 
 


అన్నం, బెల్లం, తేనె, అరటిపండ్లు తక్షణ శక్తిని ఇచ్చి నీరసాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చిన సమయంలో, తరువాత చిన్న పిల్లలు ఆహారంతో పాటు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. అల్పాహారంతో పాటు ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఉదయం పూట పాలతో పాటు నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే మంచిది. రాజ్మా, శనగలు, రాగితో చేసిన లడ్డూలను స్నాక్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: