ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ ని మాయం చెయ్యాలి అంటే ఈ చిట్కాలు పాటించండి. 

 

డయాబెటిస్ ఉన్నవారు.. రోజుకు కనీసం అంటే కనీసం అరగంట పాటు వ్యయం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల బరువు అదుపులో ఉంది డయాబెటిస్ ని అదుపు చేస్తుంది. 

 

సమయానికి ఆహారం తీసుకోవాలి.. అలాగే సమయానికి మందులు వేస్తూ తీసుకోవటం చెయ్యాలి. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే వారు సమయానికి తీసుకోవాలి.. సమయం దాటేలా తీసుకోకూడదు. 

 

డయాబెటిస్ ఉన్న వారు చెప్పులు లేకుండా అసలు తిరగకూడదు.. నడవకూడదు.. ఒకవేళా అలా కాదు అని తిరిగితే చర్మం కదిపోవడం.. పుండ్లు.. గాయాలు అవ్వడం జరుగుతుంది. అందుకే పాదాలకు రోజులు చెప్పులు వేసుకొని తిరగటం ఎంతో మంచిది. 

 

గోర్లు తీసే సమయంలో చిగురు గాయం కాకుండా చూసుకోవాలి. వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు అయితే అంత త్వరగా నయం కావు అని గుర్తించుకోవాలి. 

 

డయాబెటిస్ ఉన్న వారు ధాన్యాలు, పిండిపదార్థాలు పూర్తిగా తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.. 

 

చూశారుగా.. ఈ జాగ్రత్తలు పాటించి డయాబెటిస్ కి చెక్ పెట్టండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: