ఇటీవ‌ల కాలంలో ఎలాంటి చిన్న నొప్పి వ‌చ్చినా.. గుటుక్కుమ‌ని ట్యాబ్లెట్ల‌ను వేసేసుకుంటుంటారు. అయితే చాలా మందికి ట్యాబ్లెట్ల‌ను ఏ ఏ ప‌దార్థాల‌తో వేసుకోవాలో తెలియ‌దు. టీ తాగుతూనో లేదా జ్యూస్ లు తాగుతూనో ఇలా ర‌క‌ర‌కాల పానియాల‌తో ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటారు. అయితే ఆ చిన్న‌ పొర‌పాటులే మీ ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతాయి. మ‌రి వేటితో ట్యాబ్లెట్ల‌ను వేసుకోకూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, కూర‌గాయ‌ల‌తో కూడిన ప‌ళ్ల‌ రసాలతో ట్యాబ్లెట్ల‌ను తీసుకోకూడ‌దు.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్, బీపీ వంటి మందుల ప్రభావం తగ్గిపోతుంది. అలాగే చ‌ల్ల‌ని నీటితో ట్యాబ్లెట్ల‌ను మింగిన‌ప్పుడు. ఎందుకంటే.. అందులో ట్యాబ్లెట్స్‌ స‌రిగ్గా క‌ర‌గ‌వు. దీంతో శ‌రీరం ఆ ట్యాబ్లెట్ల‌లో ఉండే మందును శోషించుకోదు. ఫ‌లితంగా మ‌న‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య నయం కాదు. కాబ‌ట్టి..  ఎవ‌రైనా ట్యాబ్లెట్ల‌ను మింగేట‌ప్పుడు కచ్చితంగా గోరు వెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీటినే తాగాలి.  

 

దీని వ‌ల్ల ట్యాబ్లెట్ స‌రిగ్గా జీర్ణం అవుతుంది. మ‌రియు టీతో ట్యాబ్లెట్లను తీసుకోవద్దు. ఎందుకంటే.. పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. అదేవిధంగా ద్రాక్షరసం తో ట్యాబ్లెట్లను వేసుకోకూడ‌దు. ఎందుకంటే..ద్రాక్షరసంలోని ఎంజైములు ట్యాబ్లెట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో మ‌న జ‌బ్బు న‌యం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: