ఇటీవ‌ల కాలంలో చాలా మంది ప్ర‌ధానంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో బీపీ మ‌రియు షుగ‌ర్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి. ఇవి ఒక‌సారి వ‌చ్చాయంటే  ఇక పోవు. ముఖ్యంగా నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా మన ప్రాణాలకే ప్రమాదం. అయితే మనం తినే ఆహారంలో మార్పులు, చేర్పులూ చేయడం ద్వారా అయితే వీటిని కంట్రోల్‌లో పెట్ట‌వ‌చ్చు. 

 

మ‌రియు కొన్ని పింపుల్ టిప్స్ ఫాలో అవ్వ‌డం ద్వారా కూడా ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి. వాస్త‌వానికి మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యడంలో సాయపడతాయి. దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.

 

అలాగే ఓ పిడికెడు మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టి, పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల బీపీ పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటుంది. మ‌రియు పొటాషియం ఎంత ఎక్కువగా తీసుకుంటే బీపీ అంత కంట్రోల్‌‌లో ఉంటుంది. కాబట్టి పొటాషియం ఎక్కువగా  లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: