క‌రోనా వైర‌స్ మ‌ర‌ణ మృందగం మోగిస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. వైరస్‌ను నిరోధించడానికి ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయ‌నే చెప్పాలి.   ప్రజలను ఇళ్లు దాటి బయటకు రావద్దని, పరిశుభత్ర పాటించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. ఈ మ‌హ‌మ్మారి దాదాపు భూ మండ‌లాన్ని చుట్టేసింది.  వైరస్ ప్రస్తుతం 117 దేశాలకు వ్యాపించింది. కరోనా వైరస్ బారిన ప‌డి  ఇప్పటి వరకు 10,000 మందికిపైగా మృతిచెందిన‌ట్లు అధికారిక లెక్క‌ల ద్వారా తెలుస్తోంది. అయితే   వైరస్ సోకిన బాధితుల సంఖ్య 2,45,600లకు పైగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

 ఇక భార‌త‌దేశంలోనూ వేగంగా  వ్యాప్తి చెందుంతోంది. గంట‌గంట‌కు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టి వ‌రకు పాజిటివ్ కేసుల  సంఖ్య 200కు చేరువలో ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా  పంజాబ్‌కు చెందిన వ్యక్తి కరోనా వైరస్‌తో గురువారం చనిపోయాడు. గురువారం దేశవ్యాప్తంగా మరో 27 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 198కి చేరింది. గడచిన రెండు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. రెండు రోజుల్లో మొత్తం 54 కేసులు నమోదవ‌డంతో దేశంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనా వైరస్‌తో హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న ఇటలీ పర్యాటకుడు శుక్రవారం చనిపోయాడు. 

 

మార్చి మొదటి వారంలో భారత్‌కు వచ్చిన ఇటలీ దంపతులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతుడి భార్య కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ  వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16కు చేర‌డం గ‌మ‌నార్హం. బుధవారం రాత్రి వరకు 13 కేసులు నమోదవగా.. గురువారం మధ్యాహ్నం మరో పాజిటివ్ కేసు న‌మోదైంది. చా ప‌కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తుండ‌టంతో జ‌నంలో తీవ్ర భయాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన వ్యక్తికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.  చాప కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తుండ‌టంతో జ‌నంలో భ‌యాందోళ‌న‌లు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: