రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంద‌. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 16 కేసులున‌మోదు కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 3 కేసులు న‌మోద‌య్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ తాజాగా నమోదైన కేసుతో కలిపి మొత్తం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి కేసు నెల్లూరులో నమోదు కాగా స‌ద‌రు యువకుడు పూర్తిగా కోలుకున్న‌ట్లు వైద్య అధికారులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 16 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా వీరికి వివిధ స్థాయిల్లో వైద్యం అందిస్తున్నారు. అయితే ఎవ‌రూ కూడా వెంటిలేట‌ర్‌పై లేర‌ని అధికారులు చెప్ప‌డంతో పాటు సీఎం కూడా ప్ర‌క‌టించారు. అయితే దేశ వ్యాప్తంగా  కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

 

 వైరస్‌ బారిన పడుతున్న వారిలో ఇతర దేశాల నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నార‌ని వైద్యవ‌ర్గాలు విడుద‌ల చేసిన లెక్క‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.  ఇక దేశ వ్యాప్తంగా విమ‌నాశ్ర‌యాల్లో నిషేదాజ్ఞ‌ల‌ను ప్ర‌భుతం అమ‌ల్లోకి తీసుకువ‌స్తోంది. ఇక 22 నుంచి పూర్తిగా విదేశాల‌కు విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ఇప్ప‌టికే  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండంతో జ‌నంలో ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది. శుక్ర‌వారం  ఒక్కరోజే 33 కేసులు నమోదుకావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కోటి, ఇతర రాష్ట్రాల్లో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

 

దీంతో ఈ ఉదయం వరకు 197గా ఉన్న బాధితుల సంఖ్య 209కు చేరింది. శుక్రవారం యూకే నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 69 ఏళ్ల పంజాబ్‌ మహిళకు కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు.  ఏయిర్‌ పోర్టులో దిగిన ఆమెకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పంజాబ్‌ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింద‌ని వైద్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్రలో  వైరస్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంటోంది. ఇక్క‌డ కరోనా బాధితుల సంఖ్య 52గా గ‌మ‌నార్హం. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 20 మంది మాత్రం కోలుకుని ఇళ్ల‌కు చేరుకున్నారు. మృతి చెందిన వారంతా 50 ఏళ్లకు పైబడి.. డయాబెటీస్‌, గుండె, ఊపిరితిత్తుల సంబంధ, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారేన‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: