కరోనా సునామీలా మ‌నుషుల ప్రాణాల‌ను హ‌రించడానికి ముంచుకొస్తోందా..? భ భార‌త్‌పై త‌న‌ప్ర‌తాపాన్ని చూపనుందా..? మ‌నం అనుకున్నంత ఈజీగా ఈ మ‌హ‌మ్మారి లేద‌ని, ప్ర‌ధాని మోదీ చెప్పిన‌ట్లుగానే ప‌రిస్థితి అంతా తేలిక‌గ్గా తీసుకోలేని విధంగా ఉంద‌ని అర్థం చేసుకునేవిధంగా దేశ వ్యాప్తంగా గంట‌ల వ్య‌వ‌ధిలోనే పదుల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసుల న‌మోదు ప్రమాదానికి సంకేతంగా క‌న‌బ‌డుతున్నాయి. శుక్ర‌వారం ఒక్క‌రోజే 33 కేసులు న‌మోదు కావ‌డంతో భార‌త ప్ర‌జ‌లు ఆందోళ‌నకు గుర‌వుతున్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతే  కేసులు అంతకంతకూ పెరిగిపోతాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.


శుక్రవారం ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కోటి, ఇతర రాష్ట్రాల్లో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వాస్త‌వానికి శుక్ర‌వారం  ఉదయం వరకు 197గా ఉన్న బాధితుల సంఖ్య ప్రస్తుతం 209కి చేరింది. అంటే కేవ‌లం కొన్ని ఆరు గంట‌ల స‌మ‌యంలోనే 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇంకా చాలా అనుమానిత కేసుల‌కు సంబంధించిన నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వేలాది మంది ప‌రీక్ష‌ల కోసం ఆస్ప‌త్రుల డోర్‌ను త‌డుతున్నారు. ఇప్పుడు మ‌రో రెండు రోజుల్లో ఏం జ‌ర‌గ‌నుంద‌నే దాన్ని బ‌ట్టి వైర‌స్ వ్యాప్తిని అంచ‌నా వేసే అవ‌కాశం ఉంద‌ని వైద్య వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. 

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు పంజాబ్‌ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణ 16కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలున్న వారు వెంట‌నే వైద్య కేంద్రాల‌కు వెళ్లాల‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ సూచిస్తోంది. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా,  దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చ‌ని చెబుతున్నారు.  తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయి జిల్లా కేంద్రాల్లోనే ఎక్క‌డిక‌క్క‌డే ఐసోలేష‌న్ కేంద్రాల ఏర్పాటుకు విస్తృత చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: