ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మందికి టీ అల‌వాటు ఉంటుంది. ఆ అల‌వాటు ఎంత‌లా అంటే.. టైమ్‌కి టీ తాగ‌నిదే వేరే ప‌నిపై దృష్టి పెట్ట‌లేనంత‌. అయితే టీ తాగడం వల్ల చాలా నష్టాలున్నాయన్న వార్తలు చాలనే విన్నాం. దీంతో టీకి దూరంగా ఉండెందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ, లిమిట్‌గా తాగితే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకూ అందుబాటులో ఉండే టీ గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

 

ఒక కప్పు పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. అలాగే టీ తాగ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ పరిమితి తగ్గిస్తుంది. అయితే ఏ స‌మ‌యంలో ఏ టీ తాగాలో చాలా మందికి అవ‌గాహ‌నం లేక‌పోవ‌చ్చు. అలాంటి వారింద‌రికి ఇప్పుడు స‌మాధానం దొరుకుతుంది. ఒక్కోసారి కడుపులో తిప్పుతూ వికారంగా ఉండి ఏ పని చేయాలేక‌పోతుంటారు. అలాంటిప్పుడు వెంట‌నే ఓ క‌ప్పు అల్లం టీ తాగి చూడండి. తక్షణం ఉపశమనం లభిస్తుంది. 

 

మ‌రియు బాగా క‌డుపు ఉబ్బ‌రం, నొప్పిగా ఉన్న‌ప్పుడు పుదీనా ఆకులతో చేసిన టీ తాగితే.. వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. అదేవిధంగా, నిద్రలేమితో బాదపడ్తూ ఆ ప్రభావంతో మరుసటిరోజు ఏ పని చేసుకోలేక పోతున్నారా..? అయితే మీకు చామంతి పూల టీ చక్కగా ఉపయోగపడ్తుంది. అలాంటి స‌మయంలో మీరు వెంట‌నే ఓ క‌ప్పు చామంతి పూట టీ చేసుకుని తాగండి. వెంట‌నే మీకు తేడా క‌నిపిస్తుంది. ఇక బాగా త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు ఓ క‌ప్పు నార్మ‌ల్ టీ తీసుకుంటే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: