యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌లో రోజుకో కొత్త ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  వాస్త‌వానికి వ్యాధి ల‌క్ష‌ణాలను నిర్ధిష్ఠంగా క‌నుగొంటేనే దానికి అనుగుణంగా చికిత్స విధానాన్ని చేప‌ట్టడం జ‌రుగుతుంది. అది కూడా రోగికి ఇత‌ర జ‌బ్బుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని చేయ‌డం జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ్వరం, గొంతునొప్పి, పొడిదగ్గు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించారు. అయితే తాజాగా వీటికి మరిన్ని లక్షణాలు కూడా తోడయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుంది. 


66 శాతానికి పైగా రోగుల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అయితే ఇప్పుడు కొత్త‌గా చాలా మందికి  విరేచనాలు కూడా మొద‌ల‌వ‌డంతో వైద్యుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. విరేచ‌నాల‌తో మ‌నిషి తొంద‌ర‌గా త‌న రోగ నిరోధ‌క శ‌క్తిని కోల్పోయే ప్ర‌మాదముంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా విరోచ‌నాల ల‌క్ష‌ణాల‌ను ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న 30 శాతం మంది రోగుల్లో క‌నిపించడం గ‌మ‌నార్హం. వైరస్ సోకిన వారికి ముందుగా జ్వ‌రం ఆ త‌ర్వాత తీవ్ర‌మైన జ‌లుబు, పొడి ద‌గ్గు మొద‌ల‌వుతాయి. వీటితో పాటు తీవ్ర‌మైన అల‌స‌ట,  కండరాల నొప్పులు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

 

 ఈ స‌మ‌యంలోనే కొంతమందికి ఒకటి లేదా రెండు రోజుల పాటు వాంతులు లేదా విరేచనాలు అవుతున్న‌ట్లు గుర్తించారు.బెంగళూరు: కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న వేళ అయితే క‌రోనా ప్ర‌భావం ముఖ్యంగా వయోధికులపై ఎక్కువ‌గా ఉంటోంద‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు. వీరు ఎక్కువ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా వుంటుంది కాబట్టి వైరస్‌ సోకేందుకు అధిక అవకాశాలుంటాయి. వయసు పైబడిన వారు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. వీలయినంత వరకు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితి కావ‌డం చాలా శ్రేయ‌స్క‌ర‌మ‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: