ఈ మధ్యకాలంలో దాంపత్య జీవితంలో ఎన్నో మనస్పర్ధలు వస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం... పడక గది విషయంలో వారి సామర్థ్యం పై వారికి నమ్మకం లేకపోవడం కారణంగా. అన్యోన్యంగా సాగిపోతున్న దాంపత్యంలో ఎన్నో అనుమానాలు రేకెత్తి  దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్న ఈ మధ్యకాలంలో దాంపత్య జీవితంలో ఎంతో కీలకమైన శృంగారంలో... ఎవరు సరిగ్గా అనుభూతిని పొందలేక పోతున్నా విషయం తెలిసిందే. అయితే కొంతమందికి శృంగార కోరికలు ఉన్నప్పటికీ శీఘ్రస్కలనం కారణంగా తన భాగస్వామిని పూర్తిగా సంతృప్తి చేయలేకపోతున్నాను అనే అసంతృప్తి ఉంటున్నారు. 

 


 నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి పురుషులను  శీఘ్రస్ఖలనం సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇక పురుషుల్లో ఈ సమస్య ఉండటం వల్ల చాలామంది స్త్రీలు అసంతృప్తికి  కూడా గురవుతూ ఉంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య  మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు వైద్యులు. రాత్రి పడుకునే సమయంలో ప్రతిరోజు తాంబూలం వేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. కృష్ణ తులసి వేరు ను ఒక అంగుళం ముక్క తాంబూలంలో పెట్టుకొని నములుతూ మింగుతూ ఉండాలని... అలా చేయడం ద్వారా శీఘ్రస్కలన సమస్య కొంచెంకొంచెంగా దూరమవుతుంది అంటూ  వైద్యులు సూచిస్తున్నారు. 

 


 అంతేకాకుండా వేసవికాలంలో సమృద్ధిగా దొరికే పుచ్చకాయను కూడా ఎక్కువగా తీసుకోవడం ద్వారా శృంగార జీవితంలో ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు వైద్య నిపుణులు . అప్పుడే వివాహం జరిగి కొత్తగా తమ జీవితంలోకి అడుగుపెట్టే వారికీ ఇది  దివ్యౌషధంగా మారుతుంది అని అంటున్నారు. వేసవిలో దొరికే పుచ్చకాయను రోజూ తీసుకోవడం ద్వారా లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు... శరీరంలో సోడియం పొటాషియం విటమిన్లు సామర్థ్యాన్ని పెంచటంలో కూడా పుచ్చకాయ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: