ఇప్పుడు జరుగుతున్న నష్టం చిన్న‌పాటిదేనా..? క‌రోనాను ప్రాథ‌మిక ద‌శ‌లోనే అరిక‌ట్ట‌కుంటే   సమీప భవిష్యత్తులో భారీ ప్రాణ న‌ష్టం చ‌విచూడాల్సి వ‌స్తుందా అంటే...?  వైద్య నిపుణుల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కరోనా మరణాల్లో చైనాని దాటేసింది ఇటలీ. రేప్పొద్దున్న చాలా దేశాలు ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అగ్ర రాజ్యం అమెరికానే చిగురుటాకులా వణకుతోంటే, ప్రపంచంలో ఏ దేశమై కరోనా మహమ్మారి నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలదని భావించలేం. ఇప్పుడు భార‌త్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ పోతున్నాయి. 

 

హైద‌రాబాద్‌లో స్టేజి-2 కేసు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల నుంచి వ‌చ్చిన వారికే క‌రోనా వ్యాధి ప్ర‌బ‌లింది. అయితే హైదరాబాద్‌లో ఓ యువ‌కుడి విదేశాల నుంచి రాగా రెండు రోజుల పాటు కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య గ‌డిపాడు. వారం రోజుల క్రితం స‌ద‌రు యువ‌కుడితో పాటు ఇద్ద‌రు కుటుంబ‌స‌భ్యులు క‌రోనా ల‌క్ష‌ణాలతో ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే యువ‌కుడికి మూడు రోజుల క్రిత‌మే క‌రోనా పాజిటివ్ రాగా అత‌డి సోద‌రికి శ‌నివారం సోకిన‌ట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన అంశమ‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.

 

ఇదిలా ఉండ‌గా ఈ పాపానికి చైనాదే కార‌ణ‌మంటూ ప్ర‌పంచ‌దేశాలు విమ‌ర్శిస్తున్నాయి. చైనా వైర‌స్ విష‌యం దాచి పెట్ట‌డానికి కొన్ని కార‌ణాల‌ను కూడా ఆధారంగా చూపుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా చైనా తయారీ వస్తువులు కన్పిస్తాయి. అవి అధికారికంగా విక్రయించేవి కావొచ్చు, స్మగుల్డ్‌ గూడ్స్‌ కావొచ్చు. అదే చైనా ప్రత్యేకత. ఇప్పుడు చైనా తయారీ కరోనా వైరస్‌ ‘కోవిడ్‌ 19’ దాదాపు ప్రపంచంలో అన్ని చోట్లా కన్పిస్తోంది. ప్రపంచ దేశాలన్నిటికీ ఈ కరోనా వైరస్‌ పాకేసింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు  అంటూ నెటిజ‌న్లు తిట్టిపోస్తున్నారు. యావత్‌ ప్రపంచం ‘లాక్‌ డౌన్‌’ స్టేజ్‌కి వచ్చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: