భార‌త్‌లో క‌రోనా ఎఫెక్ట్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి దానికి విరుగుడుగా అటు వైద్య వ‌ర్గాల్లో ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో  త‌రుచూ పారాసిట‌మాల్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు పారాసిట్‌మాల్ స‌రిపోతుంద‌ని కేసీఆర్‌, జ‌గ‌న్ కూడా వ్యాఖ్య‌నించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి ప‌లువురు వైద్యులు కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. అయితే తాజా విష‌య‌మేటంటే నిజంగానే క‌రోనా క‌ట్ట‌డికి రోగుల‌పై పారాసిట్‌మాల్‌ను ప్ర‌యోగించిన కేర‌ళ వైద్యులు మంచి ఫ‌లితాలు రాబ‌ట్టారట‌. తొలుత వైరస్‌ బారిన పడిన వారు తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారని, వారందరికీ దగ్గు మందుతో కలిపి పారాసిట్‌మాల్‌ వాడినట్లు డాక్టర్‌ అమర్‌ఫ్టెట్లే వెల్లడించారు.

 

 4 రోజుల పాటు ఇవే మందులను వాడామని, వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. కేరళలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన రోగుల  సంఖ్య 40 చేరిన‌ట్లు ప్ర‌భుత్వం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అయితే వారంద‌రికీ మిగ‌తా వైద్యంతోపాటు పారాసిట్‌మాల్‌ను అంద‌జేస్తున్న‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు.  అయితే ప్రపంచంలోనే కాక భారత్‌లోనూ ఇప్పటి వరకు కరోనాకు సరైన వాక్సిన్‌ కనిపెట్టకపోవడంతో.. పలు రాష్ట్రాలు కూడా కేరళ బాటలోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రఖ్యాత రాంమనోహర్‌ లోహియా వైద్యులు కూడా కేరళ వైద్యులను సంప్రదించి.. సలహాలు, సూచనలు  తీసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

 

ఇదిలా ఉండ‌గా  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వైద్యులు తయారుచేస్తున్న వాక్సిన్‌ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే పారాసిట్‌మాల్ క‌రోనాను ఏవిధంగా కంట్రోల్ చేస్తోంద‌ని విష‌యాల‌ను విశ్లేష‌ణాత్మ‌క వివ‌ర‌ణాల‌ను వెల్ల‌డించ‌క‌లేక పోతున్నార‌ట‌. కేర‌ళ బాట‌లోనే ప‌లు రాష్ట్రాల వైద్యులు ప‌య‌నించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కొత్త‌గా వ్యాక్సిన్ ఏమి అవ‌సరం లేకుండానే పారాసిట్‌మాల్‌తోనే క‌రోనా కట్ట‌డి అయితే మాత్రం మానవాళి మొత్తం ఆ మందుకు ఎంతో రుణాపడి ఉన్న‌ట్లే.. కేర‌ళ వాసులు మాత్రం జై పారాసిట్‌మాల్ అంటూ క‌రోనాకు భ‌య‌ప‌డ‌కుండా పోరాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: