క‌రోనా వైర‌స్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్ర‌పంచానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మ‌హ‌మ్మారికి విరుడుగును క‌నిపెట్టే ప‌నిలో దాదాపుగా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని ఆయ‌న చెప్ప‌డంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా వేలాదిమంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించిన క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌డంలో మంచి పురుగోగ‌తి సాధించామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయితో అమెరికా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న వ్యాక్సిన్ కరోనా వైర‌స్‌ను నివారించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి హైడ్రాక్సీక్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేసినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక‌ అద్భుతమేన‌ని అన్నారు. వైద్య చ‌రిత్ర‌లో గొప్ప మలుపు సాధ్యమవుతుందని గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రంప్ చెప్పిన గుడ్ న్యూస్‌కు నెటిజ‌న్ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోంది.

*వైద్య చరిత్రలో అతిపెద్ద గేమ్ ఛేంజర్స్‌ అవతరణకు అవకాశం ఉంది. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్.. ఈ రెండింటి కలయికతో రూపొందే సరికొత్త ఔషధం సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం ఉంది. ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) దీనిపై పరిశోధన కొనసాగిస్తోంది. అజిత్రోమైసిన్ కంటే హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మంచి ఫలితాలను ఇస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ-మైక్రోబయాల్ ఏజెంట్స్ కూడా చెప్పారు. పరిశోధకులు ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. జనం చచ్చిపోతున్నారు, వేగంగా చేయండి. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ప్ర‌పంచ ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌కు వివ‌రీతంగా స్పంద‌న వ‌స్తోంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఆట‌లిక ఎక్కువ రోజులు సాగ‌వంటూ ఆనంద ప‌డుతున్నారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి 11,737 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 4వేలమంది ఇటలీ వారే ఉన్నారు. అలాగే, వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 160 దేశాల్లో 2.75 లక్షలు దాట‌డంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఇరాన్‌లో ఒక్క రోజు వ్యవధిలో 123 మంది మ‌ర‌ణించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: