భార‌త్‌లో ఆరో క‌రోనా మ‌ర‌ణం చోటుచేసుకుంది. కరోనా బారిన పడి 63 సంవత్సరాల వృద్ధుడు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యక్తికి మధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ముంబైలోని కస్బూర్భా ఆసుపత్రిలో ఇప్పటికే కరోనా బారిన పడి ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య భారత్‌లో ఆరుకు చేరింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రెట్టింపు అవుతోంది.

 

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ముంబైలోనే ఇద్ద‌రు క‌రోనా బారిన ప‌డి మృతిచెందారు. పాట్నాలో 38 ఏళ్ల యువ‌కుడు క‌రోనా వ్యాధితో చ‌నిపోయాడు. బీహార్ రాష్ట్రంలో తొలి క‌రోనా మ‌ర‌ణం నాలుగు రోజుల క్రితం న‌మోదైంది.  ఆత‌ర్వాత హైద‌రాబాద్‌లో ఒక‌రు మృతి చెందారు. క‌రోనా వ్యాప్తి మ‌హారాష్ట్ర‌లో ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా ముంబైకి విదేశీయుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మై ఉంటుంద‌ని వైద్య‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక్క‌డి నుంచి చుట్టు ప‌క్క‌ల రాష్ట్రాల‌కు ప్ర‌యాణించిన విదేశీయుల జాబితాను కూడా అధికారులు సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక  దేశంలోనే అత్యధిక కరోనా 63 పాజిటివ్ కేసులు  మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. 

 

భారత్‌లో ఇప్పటివరకూ 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌లో ఈ సంఖ్య 22కు చేరుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 5కు చేరుకుంది. అయితే భార‌త్‌లో గంట‌గంట‌కు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతునే ఉన్నాయి. ప‌రిస్థితి అదుపుతప్పుతుందోమేన‌న్న భ‌యం క‌లిగిస్తోంది. శుక్ర‌వారం 175 పాజిటివ్ కేసులుండ‌గా శనివారం రాత్రి 283 కేసుల‌కు పెరిగిన‌ట్లు కేంద్ర మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే ఆదివారం వెల్ల‌డించిన వివరాల ప్రకారం 315కేసులు కేసులు న‌మోదైన‌ట్లు పేర్కొంది. తాజాగా మ‌రోకేసు న‌మోదుకావ‌డంతో 316కు చేరుకుంది ఆసంఖ్య‌. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: