క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన నిబంధ‌న‌ల‌ను అధికార యంత్రాంగం క‌ఠినంగా అమ‌లు చేస్తున్నాయి. క‌రోనా విజృంభ‌ణ అధికం కావ‌డంతో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్ట‌డానికి కూడా పోలీసులు, సంబంధిత అధికారులు వెన‌కాడ‌టం లేదు. హైద‌రాబాద్‌లో క‌ర్ఫ్యూ పాటించ‌ని ప‌లువురిని క‌మిష‌న‌ర్ సజ్జ‌నార్ తీవ్రంగా హెచ్చ‌రించారు. కర్ఫ్యూ ఉందని తెలిసి కూడా బయటకు ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. సున్నింతంగా హెచ్చ‌రిస్తూనే ఇళ్ల‌కు చేరుకోవాల‌ని సూచించారు. అనంత‌రం స‌జ్జ‌నార్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ ‘ఇది కర్ఫ్యూ కాదు కేర్ ఫర్ యూ అని చెప్పారు. ప్రజలందరూ స్వ‌చ్ఛందంగా క‌ర్ఫ్యూలో పాల్గొనాల‌ని సూచించారు. 

 

మ‌నం కోసం మ‌నం ఇళ్ల‌లో ఉండ‌టం చేయాల‌ని, లేదంటే ఆ త‌ర్వాత బ‌తుకులు రోడ్ల‌పై ప‌డుతాయ‌ని హెచ్చ‌రిస్తునే హిత‌వు ప‌లికారు.  ఈ మంచి పనిలో ప్ర‌జ‌లంద‌రీ  భాగస్వామ్యం కావాలి అన్నారు. . అవసరం ఉంటే తప్పా ప్రజలు బయటకు రావద్దు. సైబరాబాద్ పరిధిలో 6 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రోడ్లపైకి ఎవరు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేస్తున్నాం. రేపు ఆరు గంటల వరకు ప్రజలు ఇదే రీతిలో సహకరించాలి’అని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్‌లో చాలా మంది ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా క‌ర్ఫ్యూలో పాల్గొన్నారు. ఏదో కొద్దిమంది మిన‌హా మిగిలిన వారంతా బంద్ పాటించారు.

 

మొత్తంగా ప్ర‌ధానిమోదీ, కేసీఆర్ ఆలు ఇచ్చిన జ‌న‌తా క‌ర్ఫ్యూకు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డం విశేషం.  ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో రహదారులన్నీ బోసిపోయాయి. అయితే, కొన్ని చోట్ల ఒకరిద్దరు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈనేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: