క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. చైనాలో వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచదేశాలను కుదిపేస్తోంది. దీంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అంతా అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌ 7000 పైగా జనాభా మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. మ‌రియు ఈ వైర‌స్ బారిన ప‌డిన‌వారు ల‌క్ష‌ల్లో ఉన్నారు. అయితే ఈ వైర‌స్ దాడి చేసినా మనం దానికి లొంగకుండా ఉండాలంటే... మనం ఖ‌చ్చితంగా మంచి ఆహారం తినాలి.

ఒక‌వేళ పొరపాటున కరోనా వైరస్ బారిన పడితే.. అప్పుడు మనం భయపడకుండా, ముందు నుంచే పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే బాడీలోకి వెళ్లిన వైరస్‌ మనల్ని ఏమీ చెయ్యలేక చేతులెత్తేస్తుంది. మ‌రి ఏ ఏ ఆహారం తీసుకుంటే మ‌నం క‌రోనా వైర‌స్‌తో పోరాడ‌గ‌లం అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. కణాలు పెరగాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా... వైరస్‌తో పోరాడాలన్నా... ఐరన్, జింక్, సెలెనియం కూడా చాలా అవసరం. తృణధాన్యాల్లో ఇలాంటి శక్తి ఉంటుంది. అంటే మన పోపుల డబ్బాలో ఉండే అన్ని రకాల ఐటెమ్సూ తీసుకోవాలి.

సముద్ర చేపలు, గుడ్లు, వెన్న, చోఫు, బాదం, పిస్తా వంటి పప్పులు, కూర‌గాయ‌లు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, క్యారట్, ఆకు కూరలు తింటే మ‌న‌కు విటమిన్ ఏ అందుతుంది. ఈ విట‌మిన్ ఏ మన చర్మంలో కణాలు చక్కగా ఉండేలా చేయ‌డ‌మే కాకుండా.. క‌రోనాతో పోరాడేందుకు శ‌క్తినిస్తుంది. అలాగే వైరస్‌తో పోరాడేందుకు మన కణాలకు ప్రత్యేక ఎనర్జీ కావాలి. అది విటమిన్ D ద్వారా లభిస్తుంది. అందువల్ల మీరు ఇంట్లో ఉన్నా... ఎండ తగిలేలా చేసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: