ప్రపంచంలోని దేశాలన్నింటిలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా భారీన పడినా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు కోలుకునే అవకాశం ఉంది. కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సరైన ఆహార నియమాలను పాటిస్తే వైరస్ సోకినా వ్యాధిని జయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనాతో పోరాడేందుకు ఎ, బి, సి, డి, ఇ విటమిన్లతో పాటు జింక్, ఐరన్, సెలేనియం లాంటి మినరల్స్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. 
 
విటమిన్ ఎ కోసం ఆకు కూరలు, క్యారట్, పప్పు దినుసులు, పిస్తా, వెన్న, బాదం, గుడ్లు తీసుకోవాలి. పొట్ట, శ్వాస నాళం సరిగ్గా పని చేసేందుకు ఈ ఆహారం ఉపయోగపడుతుంది. బి విటమిన్ శరీరంలోని వైరస్ లను, సూక్ష్మ క్రిములను అంతం చేస్తుంది. సోయా మిల్క్, చికెన్, మటన్, పండ్లు, పప్పులు, ఆకుకూరలు, గింజలు, తృణధాన్యాల ద్వారా బి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. 
 
కరోనాను ఎదుర్కోవడానికి సి, ఇ విటమిన్లు ఎంతో అవసరం. కూరగాయలు, పప్పులు, కాప్సికం, టమాటా, బ్రకోలి, కివీ, ఉసిరి, నిమ్మ, కమల పండ్ల ద్వారా సి విటమిన్ లభిస్తుంది. డి విటమిన్ శరీరానికి కావాల్సిన అదనపు శక్తిని అందిస్తుంది. పాలు, గుడ్లు, చేపల ద్వారా డి విటమిన్ లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఐరన్, జింక్, సెలేనియం లాంటి మినరల్స్ శరీరానికి చాలా అవసరం. అల్లం, వెల్లుల్లి, కస్తూరి ఆకులు, పసుపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పులలో శరీరానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: