లాక్‌డౌన్‌ను లైట్ తీసుకుంటున్న జ‌నాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంనేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం పోలీసుల‌కు ఫుల్ ప‌వ‌ర్స్ ఇస్తోంది. ఇప్ప‌టికే ఆదివారం నాటి కర్ఫ్యూను ఈ నెల 31వ వరకు పొడిగిస్తున్నామని, దీన్ని కచ్చితంగా అమలు చేయడం కోసం ఈ ఉత్తర్వులను ‘ఎపిడెమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1897’ కింద నోటీఫై చేసినట్లు కేసీఆర్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే.  కరోనా వైరస్‌ విస్తరణను అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును ఆదివారం ఎంతో విన‌యంగా, స్వ‌చ్ఛ‌దంగా పాటించిన ప్ర‌జ‌లు సోమ‌వారం మాత్రం ఉల్లంఘించేశారు. సోమ‌వారం ఉద‌యం నుంచి పెద్ద సంఖ్య‌లో రోడ్ల‌పైకి చేరుకోవ‌డాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. 

 

గంట‌గంట‌కు రాష్ట్రాల్లో అమ‌లవుతున్న క‌రోనా చ‌ర్య‌ల గురించి స‌మాచారం తెలుసుకుంటున్న ప్ర‌ధానిమోదీ  తెలంగాణ‌లోని ప‌రిస్థితిపై అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. దీంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ప‌క‌డ్బందీగా ఎపిడికో చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేయ‌డం విశేషం. ఈ రోజు సాయంత్రం 6గంట‌ల త‌ర్వాత రోడ్ల‌పైకి జ‌నాలు క‌న‌బ‌డితే చ‌ట్ట‌మైన శిక్షించాల‌లు విధించాల్సి వ‌స్తుంద‌ని ఈమేరకు డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి కూడా కొద్దిసేప‌టి క్రితం స్ప‌ష్టం చేశారు. కరోనా వైరస్‌ విస్తరించకుండా  నిరోధించడంలో భాగంగా ఈ చట్టంలోని రెండవ సెక్షన్‌ను ప్రయోగించాల్సిందిగా మార్చి 11వ తేదీన  కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. 

 

ఈ చట్టం ప్ర‌కారం.. ప్రభుత్వాధికారులకు ప్రత్యేక అధికారాలు ల‌భిస్తాయి. ముందస్తు అనుమతి లేకుండా రేవులు, విమానాశ్రయాలు, రైల్వే, బస్సు స్టేషన్లలోనే కాకుండా ఆయా ప్రయాణ సాధనాల్లో ప్రయాణికులను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. అలాగే రోడ్లపై తిరక్కుండా నియంత్రించే, ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ల‌భిస్తుంది. వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లుగా అనుమానం క‌లిగితే అలాంటి వ్య‌క్తుల‌ను నిర్బంధంగా వైద్య పరీక్షలకు తరలించవచ్చు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘించిన వ్యక్తులపై, సంస్థలపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అధికారం ఉంటుంది. అందుకే ఈ విష‌యాన్ని తెలుసుకుని త‌స్మాత్ జాగ్ర‌త్త‌తో మొద‌లాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: