ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య ఏదైనా ఉందటే అది కరోనా మాత్రమే. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి వేలాది మంది మృతి చెందగా, లక్షలాది కేసులు నమోదు అయ్యాయి. భారత్ లో ఇప్పుడిప్పుడు ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇదిలాఉంటే ఇది శ్వాసకోస సంభందిత వ్యాధిగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ వ్యాధిగ్రస్తులు ఊపిరి పీల్చుకోవడానికి పడే ఆటరాం చూస్తే మనకి నరాల్లో వణుకు వస్తుందట. అయితే ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపేది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వృద్ధులకి, చిన్న పిల్లలకి , దీర్ఘకాలిక అనారోగ్యంతో జీవించే వారికి ఈ వ్యాధి తీవ్రమైన ప్రభావం చూపుతుందట.

IHG

అలాగే ఉబ్బసం ఉన్నవారు ఈ వ్యాధి రాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు .బలహీనమైన ఆరోగ్య వ్యవస్థ ఉన్నవారు, ధీర్గకాలికమైన శ్వాసకోస వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ అతిపెద్ద ముప్పుని తెచ్చిపెడుతుందని తెలుస్తోంది. మరి ఉబ్బసం ఉన్న వ్యాదిగ్రస్తులకి ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే కొన్ని పద్దతులని పాటించక తప్పదు. అవేంటంటే...

IHG

ఉబ్బసం ఉన్నవారు పరిచయాలు పూర్తిగా పక్కన పెట్టాలి. వ్యాధి నియంత్రణలోకి వచ్చే వరకూ కూడా ఎవరి జాగ్రత్తలలో వారు ఉండాల్సిందే. ఇతరులతో సంభంధాలు తగ్గించుకోవాలి. సబ్బు, వేడి నీటితో చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. మీ ముక్కు , లేదా కళ్ళపై చేతులు పెట్టకూడదు. ఒకవేళ తుమ్మ వచ్చినా చేతి రుమాలు ఉపయోగించాలి తప్ప ఉత్త చేతులు పెట్టరాదు. చేతులు శుబ్రంగా లేని సమయంలో అవే చేతులతో ముక్కు కళ్ళు తాకకండి. ఉబ్బసానికి సంభందించిన మందులు రోజువారీగా వేసుకోండి. మానవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: