సాధారణంగా బిర్యానీ తయారీలో, మాంసాహార వంటకాల్లో లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. లవంగాలు వేస్తే వంటలకు కొత్త రుచి వస్తుంది. లవంగాలు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. చాలా మంది నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి లవంగాలను ఉపయోగిస్తారు. లవంగాలలో యాంటిబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. 


 
రోజూ రెండు లవంగాలను తింటే దంత సమస్యలు దూరమవుతాయి. ప్రయాణాల్లో వాంతులు చేసుకునేవారు లవంగాలను తింటే వికారం లాంటి సమస్యలు దూరమవుతాయి. లవంగాల్లో ఉండే యుజెనాల్ నూనె శరీర ఎముకలకు బలం చేకూరుస్తుంది. లవంగాలను రోజూ తింటే గ్యాస్, నోటి ఉబ్బరం, ఆపాన వాయువు సమస్యలు దూరమవుతాయి. డయాబెటిస్ తో బాధ పడేవారు ప్రతిరోజూ వీటిని తింటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 


 
కొన్ని పరిశోధనల్లో లవంగాల్లో గ్లూకోజ్ గుణాలు తగ్గించే లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఇవి కండరాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో లవంగాలు ఎంతో సహాయపడతాయి. లవంగాలను మోతాదులో వాడితే ప్రయోజనాలు ఉంటాయి. మోతాదు మించితే మాత్రం వీటి వల్ల చెడు జరిగే అవకాశం ఉంది. రోజుకు నాలుగైదు లవంగాలను మించి తీసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: